పవన్ కల్యాణ్ కోసం భారీ సెట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరి నుంచి మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు. పవన్-క్రిష్ మూవీ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే ఓ సెట్ వేశారు. ఇప్పుడు ఓల్డ్ చార్మినార్ ను తలపించేలా మరో సెట్ రూపొందిస్తున్నారు. నిజాం కాలంలో చార్మినార్ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి
సంబంధించి ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరి నుంచి మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు.
పవన్-క్రిష్ మూవీ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే ఓ సెట్ వేశారు. ఇప్పుడు ఓల్డ్
చార్మినార్ ను తలపించేలా మరో సెట్ రూపొందిస్తున్నారు. నిజాం కాలంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు
ఎలా ఉండేవో అలా సెట్ తయారుచేస్తున్నారు. దీంతో పాటు నిజాం దర్బార్ ను తలపించేలా మరో సెట్
నిర్మిస్తున్నారు.
ఇలా పవన్ కోసం భారీ సెట్స్ కొన్ని రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సెట్స్ లోనే మేజర్ పార్ట్ షూటింగ్
కంప్లీట్ చేయాలని నిర్ణయించాడు క్రిష్. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా వస్తోంది ఈ సినిమా.