ఎన్నికలతో వ్యాక్సినేషన్ కి ఆటంకం..

కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలలోనూ, కరోనా కట్టడిలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీ ముందంజలో ఉంది. దేశవ్యాప్త కరోనా మరణాల సగటులో ఏపీ సంఖ్య సగానికి సగం. దేశవ్యాప్తంగా ప్రతి 100మంది కరోనా రోగుల్లో ఇద్దరికిపైగా మరణిస్తే.. ఏపీలో మాత్రం వందలో ఒక్కరినే కొవిడ్ బలితీసుకుంది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా కరోనాని సమర్థంగా ఎదుర్కొన్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఇక వ్యాక్సినేషన్ విషయానికొచ్చే సరికి ఏపీలో టార్గెట్ రీచ్ అయ్యే […]

Advertisement
Update:2021-01-26 05:11 IST

కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలలోనూ, కరోనా కట్టడిలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీ ముందంజలో ఉంది. దేశవ్యాప్త కరోనా మరణాల సగటులో ఏపీ సంఖ్య సగానికి సగం. దేశవ్యాప్తంగా ప్రతి 100మంది కరోనా రోగుల్లో ఇద్దరికిపైగా మరణిస్తే.. ఏపీలో మాత్రం వందలో ఒక్కరినే కొవిడ్ బలితీసుకుంది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా కరోనాని సమర్థంగా ఎదుర్కొన్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఇక వ్యాక్సినేషన్ విషయానికొచ్చే సరికి ఏపీలో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. స్థానిక పోరుతో ఏపీలో టీకా ప్రక్రియకి ఆటంకం ఏర్పడుతోంది. సరిగ్గా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో దశలోకి వెళ్తున్న సమయంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావడం, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ ఎన్నికల డ్యూటీలకు వెళ్లాల్సి రావడంతో వారికి టీకాలు వేయడం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తికాదనే విషయం తేలిపోయింది.

ఇప్పటి వరకు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 1.49 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. ఇక రెండో దఫా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ లో 73,188 మంది పోలీసులు సహా, మొత్తం ఏడు లక్షల మంది సిబ్బంది ఉన్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి.. టీకా వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దశలో సుప్రీంకోర్రు తీర్పుతో ఎన్నికలకు వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకా తీసుకోకుండానే విధులకు హాజరవ్వాల్సి వస్తోంది. ఒకవేళ టీకా వేసినా, వారిని అబ్జర్వేషన్లో ఉంచడం, సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే అత్యవసర ఆరోగ్య సేవలు అందించడం అన్నిటికీ అవాంతరాలు ఎదురవుతాయి. ఇలా టీకా వేసుకుని, అలా ఎన్నికల డ్యూటీలకు పంపించడం సాధ్యం కాదు. అందుకే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. టీకాలు, ఎన్నికలు.. ఒకేసారి కుదరవని, ప్రత్యామ్నాయం చూపించాలని తేల్చి చెప్పింది.

వాస్తవానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను ఒకేసారి మొదలు పెట్టి, ఒకేసారి పూర్తి చేయాలనేది కేంద్రం ఆలోచన. అందుకే ఒకటి, రెండు దశల్ని కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేసమయానికి మొదలయ్యేలా ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ ని కొనసాగిస్తోంది. అలా జరిగితేనే వ్యాక్సిన్ డోసుల పంపకం, ఇతర కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయి. ప్రస్తుతం ఏపీలో మినహా ఇంకెక్కడా ఎన్నికల హడావిడి లేదు. అంటే.. ఇక్కడ స్థానిక ఎన్నికలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభావితం అవుతుందని స్పష్టమవుతోంది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తుందేమో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News