రిపబ్లిక్ ప్రకటించిన సాయితేజ్

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘‘యువరానర్.. ప్రజలు […]

Advertisement
Update:2021-01-25 14:17 IST

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజ‌కీయ నాయ‌కులు.. శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు… ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్రమ‌బ‌ద్దంగా సాగిన‌ప్పుడే అది ప్ర‌జాస్వామ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వ‌మ‌వుతుంది….అదే అస‌లైన రిప‌బ్లిక్‌’’ అంటూ సాయితేజ్ వాయిస్‌లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోష‌న్ పోస్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవికే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మోషన్ పోస్టర్ లో ఆ విషయాన్ని ప్రకటించారు కూడా. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News