సమ్మర్ కు సిద్ధమైన సాయితేజ్

ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు హీరో సాయితేజ్. ఇందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఆల్రెడీ థియేటర్లలోకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో, ఇప్పుడు తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయితేజ్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో, రమ్యకృష్ణకీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని తాజాగా […]

Advertisement
Update:2021-01-23 14:27 IST

ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు హీరో సాయితేజ్. ఇందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఆల్రెడీ థియేటర్లలోకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో, ఇప్పుడు తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు.

దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయితేజ్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో, రమ్యకృష్ణకీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయించారు.

ఈ రెండు సినిమాలతో పాటు ఇదే ఏడాది మరో మూవీని కూడా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. ఆ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది సాయితేజ్ టార్గెట్. ఇలా ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News