లక్ష్య టీజర్ రివ్యూ
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. ”చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒకడు పుడతాడు,.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు” అంటూ విలక్షణ నటుడు జగపతిబాబు వాయిస్ […]
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. శ్రీ
వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో
నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.
నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. ”చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది.
కానీ ఎవడో ఒకడు పుడతాడు,.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు” అంటూ విలక్షణ నటుడు జగపతిబాబు
వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ సినిమాలో ఆర్చరీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపించనున్నాడని
తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటప్‌లలో దర్శనమివ్వడంతో నాగశౌర్య పాత్రలో రకరకాల షేడ్స్
ఉన్నాయన్న విషయం అర్థం అవుతోంది.
చివరలో 'పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం..అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్
ఆకట్టుకుంటుంది. కాలబైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కు మరింత బలాన్నిఇచ్చింది. ఈ టీజర్ సినిమాపై
అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ సాధించాడు శౌర్య.