రిలీజ్ డేట్ కు 'చెక్'
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా చెక్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది నితిన్ సినిమా. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది ఈ సినిమా కథ. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందంటున్నాడు హీరో నితిన్. రీసెంట్ […]
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న
సినిమా చెక్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న గ్రాండ్ గా థియేటర్లలోకి
రాబోతోంది నితిన్ సినిమా.
జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని
ఎలా చేరుకున్నాడనేది ఈ సినిమా కథ. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందంటున్నాడు హీరో
నితిన్. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ కు సినిమాపై నమ్మకం
మరింత పెరిగింది.
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పోసాని
కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. కల్యాణి
మాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.