తనకు పోటీ ఎవరో చెప్పిన రామ్
ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవ్వరు? హీరో రామ్ ను చాలామంది అడిగే ప్రశ్న ఇది. రీసెంట్ గా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రెడ్ సక్సెస్ మీట్ లో ఈ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చాడు రామ్. “15 సంవత్సరాల ముందు ఇదే సంక్రాంతికి దేవదాస్ సినిమాతో వచ్చా . పరిశ్రమలో ఇప్పటికీ చాలా మంది మీకు కాంపిటీషన్ ఎవరు అని అడుగుతుంటారు. 15 సంవత్సరాల తరువాత నా కాంపిటీషన్ […]
ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవ్వరు? హీరో రామ్ ను చాలామంది అడిగే ప్రశ్న ఇది. రీసెంట్ గా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రెడ్ సక్సెస్ మీట్ లో ఈ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చాడు రామ్.
“15 సంవత్సరాల ముందు ఇదే సంక్రాంతికి దేవదాస్ సినిమాతో వచ్చా . పరిశ్రమలో ఇప్పటికీ చాలా మంది మీకు కాంపిటీషన్ ఎవరు అని అడుగుతుంటారు. 15 సంవత్సరాల తరువాత నా కాంపిటీషన్ ఎవరనే విషయం అర్థం అయింది. అభిమానులుగా మీరు చూపించే ప్రేమ ఎక్కువా, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువా అన్నదాంట్లోనే మనకి పోటీ నడుస్తోంది.”
ప్రస్తుతం రెడ్ సినిమాకు వసూళ్లు తగ్గాయి. సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ రామ్ మాత్రం తన సినిమా సూపర్ హిట్ అంటున్నాడు. అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాడు.
“మేం చాలా ట్విస్టులతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసాం. కానీ సినిమా లో ఉన్న ట్విస్టులకన్నా సినిమా
విడుదల తరువాత ఒక పెద్ద ట్విస్ట్ ని ఎక్స్ పీరియన్స్ చేశాం. నిజానికి సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ
సినిమాను ఆడియన్స్ ఎలా రిజీవ్ చేసుకుంటారు? వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అని ఈగర్‌గా
వెయిట్ చేశాం. మార్నింగ్ షో కి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్రతి షో
పూర్తయిన తర్వాత మరుసటి షోకి కలెక్షన్లు అంతకంతకూ పెరగసాగాయి. మా సస్పెన్స్ థ్రిల్లర్ ని థ్రిల్లింగ్
హిట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.”