త్వరలో గ్రేటర్​ పాలకమండలి..! మేయర్​ పీఠం ఎవరికి?

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నూతన పాలకమండలి ఏర్పాటు కాలేదు. ఇందుకు ఇంకా సమయం ఉందని ఎన్నికల సంఘం ఇంతకాలం చెబుతూ వచ్చింది. అయితే పాలకమండలి ఎందుకు ఏర్పాటుచేయడం లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. హడావుడిగా ఎన్నికలు జరిపిన ఈసీ.. పాలకమండలి ఏర్పాటులో ఎందుకు జాప్యం వహిస్తోందని వాళ్లు ప్రశ్నించారు. మరోవైపు స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్​ అధికార పార్టీ జేబు సంస్థలా మారిపోయిందని కూడా బీజేపీ నేతలు ప్రశ్నించారు. వెంటనే పాలకమండలి […]

Advertisement
Update:2021-01-17 05:06 IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నూతన పాలకమండలి ఏర్పాటు కాలేదు. ఇందుకు ఇంకా సమయం ఉందని ఎన్నికల సంఘం ఇంతకాలం చెబుతూ వచ్చింది. అయితే పాలకమండలి ఎందుకు ఏర్పాటుచేయడం లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. హడావుడిగా ఎన్నికలు జరిపిన ఈసీ.. పాలకమండలి ఏర్పాటులో ఎందుకు జాప్యం వహిస్తోందని వాళ్లు ప్రశ్నించారు.

మరోవైపు స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్​ అధికార పార్టీ జేబు సంస్థలా మారిపోయిందని కూడా బీజేపీ నేతలు ప్రశ్నించారు. వెంటనే పాలకమండలి ఏర్పాటుచేయాలంటూ బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఇటీవల ప్రగతిభవన్​ ముట్టడికి కూడా యత్నించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు పాలకమండలి ఏర్పాటుచేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. శనివారం 150 వార్డుల కార్పొరేటర్ల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది.

నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం 30 రోజుల్లో పాలకమండలి ఏర్పాటు చేయాలి. కాబట్టి వచ్చే నెల 15 లోపు పాలకమండలి కొలువుదీరనున్నది. ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది.

మేయర్​ పీఠం ఎవరికి?

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌కు 2 స్థానాలు వచ్చాయి. అయితే టీఆర్​ఎస్​కు 35 మందికిపైగా ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో టీఆర్​ఎస్​ మేయర్​ పీఠం దక్కుంచుకుంటుందని సమాచారం. అయితే టీఆర్​ఎస్​, ఎంఐఎం రహస్య ఒప్పందం చేసుకున్నాయని గతంలోనే బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News