బాలయ్య సమస్య సమంతకు చుట్టుకుంది
బాలయ్య లాంటి సీనియర్ హీరోలకున్న సమస్య గురించి అందరికీ తెలిసిందే. వాళ్లు ఓ ప్రాజెక్టు సెట్ చేస్తే, అందులో హీరోయిన్ ను వెదకడం యమ కష్టం. షష్టి పూర్తి వయసున్న హీరోల సరసన నటించడానికి పడుచు పిల్లలెవ్వరూ ముందుకురారు. ప్రతిసారి బాలయ్యకు ఇదే సమస్య. ఈసారి ఆ సమస్య సమంతకు చుట్టుకుంది. సమంత సరసన నటించేందుకు హీరోలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. సమంత చేసేవన్నీ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్. తన […]
బాలయ్య లాంటి సీనియర్ హీరోలకున్న సమస్య గురించి అందరికీ తెలిసిందే. వాళ్లు ఓ ప్రాజెక్టు సెట్
చేస్తే, అందులో హీరోయిన్ ను వెదకడం యమ కష్టం. షష్టి పూర్తి వయసున్న హీరోల సరసన నటించడానికి
పడుచు పిల్లలెవ్వరూ ముందుకురారు. ప్రతిసారి బాలయ్యకు ఇదే సమస్య. ఈసారి ఆ సమస్య సమంతకు
చుట్టుకుంది.
సమంత సరసన నటించేందుకు హీరోలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా
ఇదే నిజం. సమంత చేసేవన్నీ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్. తన సినిమాల్లో తనే హీరో. మరి ఇలాంటి
సినిమాల్లో నటించడానికి ఏ హీరో ముందుకొస్తాడు చెప్పండి. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న
శాకుంతలం సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది.
ఈ సినిమాలో శకుంతలగా కనిపించనుంది సమంత. అయితే ఆమె సరసన దుష్యంతుడిగా నటించడానికి
ఎవ్వరూ ముందుకురావడం లేదంట. దీంతో గుణశేఖర్ ఇప్పుడు తమిళ, మలయాళ నటుల వైపు
చూస్తున్నారు. ఎవరో ఒకర్ని తొందరగా సెట్ చేసి సెట్స్ పైకి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నాడు. ఏమాత్రం
లేట్ అయినా మళ్లీ సమంత మనసు మారిపోతుందని గుణశేఖర్ భయం.