ఎట్టకేలకు మారుతి నుంచి మరో మూవీ
ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ తో ఓ సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు మారుతి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిన్నాయి. దీంతో […]
ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ తో ఓ సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు మారుతి.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిన్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – మారుతి కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ ద్వారానే భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు మారుతి.
గోపీచంద్-మారుతి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ తరువాత మారుతి చేయబోయే సినిమా పై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్ లో ఓ హ్యూమరస్ వీడియోని సిద్ధం చేసి విడుదల చేశారు, ఈ వీడియోకి ప్రముఖ నటుడు రావురమేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొసమెరుపు.
గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది, దీనికి సంబంధించిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో అధికారికంగా విడుదల అవ్వబోతున్నాయి.