క్రాక్ హిట్టయితే మళ్లీ మరో ఛాన్స్
దర్శకుడు గోపీచంద్ మలినేనికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు హీరో రవితేజ. తాజా చిత్రం క్రాక్ హిట్టయితే, వెంటనే అతడికి మరో ఛాన్స్ ఇస్తానని ఓపెన్ గా ప్రకటించాడు. క్రాక్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అతడు ఈ విషయాన్ని ఏకంగా మీడియాకే పబ్లిక్ గా చెప్పాడు. మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది క్రాక్. 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా హిట్టయితే.. గోపీచంద్ మలినేనికి వెంటనే అవకాశం ఇస్తానన్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడీ సినిమా […]
దర్శకుడు గోపీచంద్ మలినేనికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు హీరో రవితేజ. తాజా చిత్రం క్రాక్ హిట్టయితే, వెంటనే అతడికి మరో ఛాన్స్ ఇస్తానని ఓపెన్ గా ప్రకటించాడు. క్రాక్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అతడు ఈ విషయాన్ని ఏకంగా మీడియాకే పబ్లిక్ గా చెప్పాడు.
మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది క్రాక్. 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా హిట్టయితే.. గోపీచంద్ మలినేనికి వెంటనే అవకాశం ఇస్తానన్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. అది పూర్తయిన వెంటనే మళ్లీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తాడన్నమాట.
రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే 2 సినిమాలొచ్చాయి. క్రాక్ సినిమా మూడోది. ఇది హిట్టయితే గోపీచంద్ జాక్ పాట్ కొట్టినట్టే. అయితే ఇండస్ట్రీ టాక్ మాత్రం ఈ సినిమాపై అంతగా లేదు. చాలామంది ఇండస్ట్రీ జనాలు ఈ సినిమాను యావరేజ్ అంటున్నారు తప్ప హిట్ అనడం లేదు. ఏ విషయం 9వ తేదీన తేలిపోతుంది.