ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోకి ఇప్పుడు చిరంజీవి కూడా ఎంటరైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తెరపై కనిపించరట. తెర వెనక నుంచి వినిపిస్తారట. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ గాసిప్ ఇదే. జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ టీజర్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ టీజర్ కు చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకుంటున్నారట. […]

Advertisement
Update:2021-01-04 12:52 IST

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోకి ఇప్పుడు చిరంజీవి కూడా ఎంటరైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తెరపై కనిపించరట. తెర వెనక నుంచి వినిపిస్తారట. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ గాసిప్ ఇదే.

జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ టీజర్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ టీజర్ కు చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఆర్ఆర్ఆర్ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఆ తర్వాత రిలీజైన ఎన్టీఆర్ టీజర్ కు చరణ్ తన గొంతు కలిపాడు. ఇప్పుడు వీళ్లిద్దర్నీ కలిపి కట్ చేస్తున్న స్పెషల్ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తాడనేది లేటెస్ట్ ప్రచారం. దీనిపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News