గాడ్సేగా మారిన సత్యదేవ్

ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకొని, డిఫ‌రెంట్‌ స్క్రిప్టుల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు స‌త్య‌దేవ్‌. ఆయ‌న హీరోగా గోపిగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ నిర్మాత సి. క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. స‌త్య‌దేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేష‌న్‌లో గతంలో వ‌చ్చిన ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ చిత్రం క్రిటిక్స్ మెప్పు పొందింది. రీసెంట్ గా చిరంజీవి కూడా ఆ సినిమాను ప్రత్యేకంగా […]

Advertisement
Update:2021-01-03 11:29 IST

ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకొని, డిఫ‌రెంట్‌ స్క్రిప్టుల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు స‌త్య‌దేవ్‌. ఆయ‌న హీరోగా గోపిగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ నిర్మాత సి. క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు.

స‌త్య‌దేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేష‌న్‌లో గతంలో వ‌చ్చిన ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ చిత్రం క్రిటిక్స్ మెప్పు పొందింది. రీసెంట్ గా చిరంజీవి కూడా ఆ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలాంటి మూవీ తర్వాత వీళ్లిద్దరూ కలిసి గాడ్సేతో వస్తున్నారు.

ఈ మూవీలో స‌త్య‌దేవ్ చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం విడుద‌ల చేసిన టైటిల్ పోస్ట‌ర్ ద్వారా తెలుస్తోంది. గ‌న్స్‌తో, ఇంటెన్స్ లుక్స్‌తో ఆయ‌న క‌నిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌లోనూ బుల్లెట్ క‌నిపిస్తుండ‌టం బ‌ట్టి ఇదొక కంప్లీట్ యాక్ష‌న్‌ మూవీ అనే విషయం అర్థమౌతుంది.

Tags:    
Advertisement

Similar News