మనం.. ఈసారి దగ్గుబాటి కాంపౌండ్ లో..!

మనం సినిమా.. అక్కినేని హీరోలకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి సినిమా. అక్కినేని ప్రముఖ హీరోలంతా కలిసి చేసిన సినిమా. ఇవన్నీ పక్కనపెడితే సూపర్ హిట్టయిన సినిమా. అందుకే అక్కినేని హీరోలకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. ఇలాంటి ఓ ప్రత్యేకమైన సినిమాను దగ్గుబాటి హీరోలకు ఇవ్వాలనే కోరిక రామానాయుడికి చాన్నాళ్లుగా ఉండేది. వెంకటేష్, రానాలతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసి, అందులో తను కూడా ఓ చిన్న గెస్ట్ […]

Advertisement
Update:2020-12-30 08:27 IST

మనం సినిమా.. అక్కినేని హీరోలకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి సినిమా. అక్కినేని ప్రముఖ హీరోలంతా కలిసి చేసిన సినిమా. ఇవన్నీ పక్కనపెడితే సూపర్ హిట్టయిన సినిమా. అందుకే అక్కినేని హీరోలకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకం.

ఇలాంటి ఓ ప్రత్యేకమైన సినిమాను దగ్గుబాటి హీరోలకు ఇవ్వాలనే కోరిక రామానాయుడికి చాన్నాళ్లుగా ఉండేది. వెంకటేష్, రానాలతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసి, అందులో తను కూడా ఓ చిన్న గెస్ట్ రోల్ చేయాలని రామానాయుడు అప్పట్లో అనుకున్నారు. కానీ ఆయన ఆశ తీరలేదు.

ఇప్పుడా కోరికను నెరవేర్చడానికి సురేష్ బాబు రెడీ అవుతున్నారు. రానా-వెంకీ హీరోలుగా మనం లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాడు సురేష్ బాబు. ఈ మేరకు దర్శకుడు సతీష్ వేగేశ్న.. సురేష్ బాబుకు ఆల్రెడీ స్టోరీలైన్ వినిపించాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News