మాస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ హీరోగా నటిస్తున్న మాస్టర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మాస్టర్ రిలీజ్ కు అఫీషియల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టయింది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అవుతాయంటున్నారు మేకర్స్. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకుముందు ఖైదీ సినిమాతో ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు […]

Advertisement
Update:2020-12-29 12:23 IST

విజయ్ హీరోగా నటిస్తున్న మాస్టర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మాస్టర్ రిలీజ్ కు అఫీషియల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టయింది.

విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అవుతాయంటున్నారు మేకర్స్. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకుముందు ఖైదీ సినిమాతో ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు

అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ఈ సినిమాతోనే స్టార్ట్ కాబోతోంది. కొన్నేళ్లుగా ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ రజనీకాంత్ సినిమాతో మొదలయ్యేది. ఈసారి కరోనా కారణంగా రజనీకాంత్ సినిమా సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోలేకపోయింది. దీంతో ఆ స్థానాన్ని విజయ్ మాస్టర్ మూవీ భర్తీ చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News