ఇవి తింటే వయసైపోయినట్టు కనిపిస్తారు

అందంగా కనిపించాలంటే ముందు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందే చర్మాన్నే.. చర్మానికి పైపై మెరుగులు మాత్రమే కాదు. దానికి లోపలి నుంచి పోషణ అందాలి. అప్పుడే అది ఎప్పుడూ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయినట్టు కనిపించేలా చేస్తాయి. అవి ఏంటంటే.. హై ఫ్రక్టోజ్ అండ్ షుగర్ హై ఫ్రక్టోజ్ సిరప్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే.. త్వరగా బరువు పెరగడంతో పాటు, […]

Advertisement
Update:2020-12-23 09:35 IST

అందంగా కనిపించాలంటే ముందు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందే చర్మాన్నే.. చర్మానికి పైపై మెరుగులు మాత్రమే కాదు. దానికి లోపలి నుంచి పోషణ అందాలి. అప్పుడే అది ఎప్పుడూ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయినట్టు కనిపించేలా చేస్తాయి. అవి ఏంటంటే..

హై ఫ్రక్టోజ్ అండ్ షుగర్

హై ఫ్రక్టోజ్ సిరప్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే.. త్వరగా బరువు పెరగడంతో పాటు, చర్మం త్వరగా సాగిపోయి, వదులుగా కనిపిస్తుంది. చర్మ అందానికి ప్రొటీన్స్ చాలా అవసరం. అయితే ఇలాంటి హై షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్ జరిగి, శరీరంలోని గ్లైకోజ్.. ప్రొటీన్స్‌తో కలిసి బైండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ వల్ల చర్మం అందహీనంగా కనిపిస్తుంది.

బేకరీ ఫుడ్స్

బేకరీలో తయారయ్యే బేక్డ్ ఫుడ్స్‌లో షుగర్స్, ఫ్యాట్స్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తినడం వల్ల చర్మం త్వరగా పాడైపోతుంది. ఇందులో వాడే కొన్ని పదార్థాలు ఏజింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి. దాంతో చర్మం త్వరగా వయసైపోయినట్టు కనిపిస్తుంది. అందుకే యవ్వనంగా కనిపించాలనుకునే వాళ్లు బేకరీఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే హై కెఫిన్, సోడియం కంటెంట్ శరీరాన్ని లోపల డీహైడ్రేట్ చేస్తాయి. దాంతో చర్మం వాడిపోయినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా షుగర్స్, సాల్ట్స్, యాసిడ్స్ ఇవన్నీ డెంటల్ హెల్త్‌ను కూడా పాడు చేస్తాయి.

ఆల్కహాల్

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మం చాలా ఎఫెక్ట్ అవుతుంది. కళ్లు, చర్మం కళ కోల్పోయి, పాడవుతాయి. దాంతోపాటు ఆల్కహాల్ వల్ల లివర్ కూడా పాడవుతుందన్న సంగతి తెలిసిందే.. అయితే లివర్ పనితీరు తగ్గినప్పుడు అది టాక్సిన్స్‌ను శుద్ధి చేయడం మానేస్తుంది. దాంతో చర్మంలోని టాక్సిన్స్ అన్నీ అలాగే ఉండిపోయి వయసైపోయినట్టు కనిపిస్తుంది. అందుకే అందంగా కనిపించాలంటే.. ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం మంచిది.

ప్రాసెస్డ్ మీట్

ప్రాసెస్డ్ మీట్ శరీరంలో విటమిన్ C శాతాన్ని తగ్గిస్తుంది. దాంతో చర్మంలో కొల్లాజెన్ ఫార్మేషన్ తగ్గి, చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. పైగా నిల్వ చేసిన, ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు కూడా గురవుతుంది. అందుకే యవ్వనంగా కనిపించాలనుకుంటే.. ప్రాసెస్డ్ మీట్‌కు బదులు తాజా మాంసం, కూరగాయలు తినడం ఉత్తమం.

చిప్స్..

కాలక్షేపం కోసం అప్పుడప్పుడు తినే పొటాటో చిప్స్‌తో ఎంతో నష్టం ఉందని తెలుసా? ఇలాంటి ప్యాక్డ్ చిప్స్‌లో హై సాల్ట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో జింక్ లాంటి ముఖ్యమైన మినరల్స్‌ను వాడుకుంటాయి. అలాగే సాల్ట్స్ చర్మంలో ఉండే నీటిని, కణాలను కుచించుకుపోయేలా చేస్తాయి. సరిపడా వాటర్ కంటెంట్ లేనప్పుడు చర్మం త్వరగా పొడిబారుతుంది.

Advertisement

Similar News