కోవిడ్ ఎఫెక్ట్ : నిద్రలేమి, ఆతృతతో బాధపడుతున్న తల్లులు
కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. కరోనా బారిన పడటం ఒకటైతే.. కరోనా సోకని వాళ్లు ఇతర రుగ్మతలకు గురవుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తల్లులు తీవ్రమైన నిద్రలేమి, ఆతృతతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. మాతృసంబంధిత నిద్రలేమి అనేది సాధారణంగా చాలా మంది స్త్రీలలో ఉంటుంది. పిల్లల పెంపకం పట్ల ఉండే ఆందోళనతో నిద్రలేమికి గురవుతారు. అలాంటి వారి సంఖ్య ఈ కోవిడ్ సమయంలో 23 శాతం పెరిగినట్లు అధ్యయనం తేల్చింది. గతంలో […]
కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. కరోనా బారిన పడటం ఒకటైతే.. కరోనా సోకని వాళ్లు ఇతర రుగ్మతలకు గురవుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తల్లులు తీవ్రమైన నిద్రలేమి, ఆతృతతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. మాతృసంబంధిత నిద్రలేమి అనేది సాధారణంగా చాలా మంది స్త్రీలలో ఉంటుంది. పిల్లల పెంపకం పట్ల ఉండే ఆందోళనతో నిద్రలేమికి గురవుతారు. అలాంటి వారి సంఖ్య ఈ కోవిడ్ సమయంలో 23 శాతం పెరిగినట్లు అధ్యయనం తేల్చింది. గతంలో ఇలాంటి వారు 11 శాతం వరకు ఉండేవారు.
ఈ నివేదిక ప్రకారం 80 శాతం మంది తల్లులు సాధారణ నుంచి అసాధారణ స్థాయిలో ఆతృతకు గురవుతున్నారు. ఈ అధ్యయనంలో తల్లులకు రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఒకటి కోవిడ్ ముందు మీ పరిస్థితి ఎలా ఉంది? రెండోది లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన సమయంలో మీ ఆలోచనా ధోరణి ఎలా ఉందని ప్రశ్నించారు.
తల్లులు ఇచ్చిన సమాధానాలన్నింటినీ క్రోఢీకరించి చూడగా.. అనేక మంది సరైన నిద్ర పోవడం లేదని తెలిసింది. నిద్రలేమితో బాధపడే తల్లులలో కోవిడ్-19కు సంబంధించిన ఆతృత కూడా పెరిగినట్లు గుర్తించారు. అంతే కాకుండా తల్లుల కారణంగా పిల్లలు కూడా నిద్ర పోయే సమయం తగ్గిపోయినట్లు తెలుసుకున్నారు. అయితే 12 శాతం తల్లులు మాత్రం తాము బాధపడినా.. పిల్లలు నిద్రపోయే సమయం మాత్రం పెరిగినట్లు చెప్పారు.