అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న తేజశ్వి... డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావన్న నితీష్

బీహార్ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలు మహాకూటమి పేరుతో బరిలోకి దిగాయి. మహాకూటమికి లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆర్జేడీ నాయకుడు తేజశ్వి ప్రసాద్ యాదవ్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. అతని బహిరంగ సభలకు వేలది మంది ప్రజలు వస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ర్యాలీలో మరోసారి ఉద్యోగాలపై తన హామీపై స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో […]

Advertisement
Update:2020-10-22 13:44 IST

బీహార్ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలు మహాకూటమి పేరుతో బరిలోకి దిగాయి. మహాకూటమికి లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆర్జేడీ నాయకుడు తేజశ్వి ప్రసాద్ యాదవ్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. అతని బహిరంగ సభలకు వేలది మంది ప్రజలు వస్తున్నారు.

తాజాగా జరిగిన ఒక ర్యాలీలో మరోసారి ఉద్యోగాలపై తన హామీపై స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి, నిరుద్యోగం పెరిగిపోవడానికి సీఎం నితీష్ పరిపాలనే కారణమని చెప్పారు. నితీష్ కుమార్ శారీరికంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయారని తేజశ్వి చెప్పారు.

కాగా, 10 లక్షల ఉద్యోగాలకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారని నితీష్ ప్రశ్నించారు. దీనికి తేజశ్వి కూడా జవాబిచ్చారు. 10 లక్షల ఉద్యోగాలకు ఎక్కడి నుంచి నిధులు తీసుకొని వస్తామని మమ్మల్ని ప్రశ్నించకుండా.. మీ పాలనలో జరిగిన కుంభకోణాల మీద ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహాకూటమి నేత చెబుతున్నట్లు తన పరిపాలనలో ఎలాంటి స్కామ్స్ జరగలేదని.. భర్త, భార్య పాలనలో బీహార్‌లో పెరిగిన నేరాల రేటుకు జవాబు చెప్పాలని లాలు, రబ్రీదేవి 15 ఏళ్ల పాలనపై ప్రశ్నించారు.

కాగా, తేజశ్వి సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటంపై బీజేపీ కూడా స్పందించింది. సభలకు పెద్ద సంఖ్యలో వచ్చినా ఓట్లుగా మారతాయని చెప్పలేమని అన్నారు. గతంలో లాలూ ర్యాలీలకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చినా అవి ఓట్లుగా మారలేదన్నారు. మరి పీఎం మోడీ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు కదా అని ప్రశ్నించగా.. మోడీని ఇతరులతో పోల్చి చూడలేమన్నారు. దేశంలో మోడీకంటూ ప్రత్యేక చరిష్మా ఉందని చెప్పారు.

Advertisement

Similar News