నాని సరసన ఉప్పెన బ్యూటీ

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది హీరోయిన్ కృతి షెట్టి. అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ బెంగళూరు బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయిన ఈ చిన్నది, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. ఏకంగా నాని సరసన నటించబోతోంది. త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారు. […]

Advertisement
Update:2020-10-05 02:00 IST

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది హీరోయిన్ కృతి షెట్టి. అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ బెంగళూరు బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయిన ఈ చిన్నది, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. ఏకంగా నాని సరసన నటించబోతోంది.

త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారు. ఇందులో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం కృతి షెట్టిని సంప్రదించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్.

పేరుకు ఇది సెకెండ్ హీరోయిన్ రోల్ అయినప్పటికీ.. కృతి షెట్టికి కూడా సమప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించడానికి ఆమె దాదాపు అంగీకరించినట్టు తెలుస్తోంది.

అలా ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వకముందే 2 సినిమా ఆఫర్లు పట్టేసింది కృతి షెట్టి. అటు ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కూడా.. తన డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకముందే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Advertisement

Similar News