జగన్‌ ప్రభుత్వంపై వందశాతం సంతృప్తి... అందుకే నెంబర్‌ వన్ " వలవన్

ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు ఏపీ పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌. పెట్టుబడిదారులు, ఆడిటర్లు, లాయర్లతో సహా పలువర్గాల వారిని సర్వే చేసి ఈ ర్యాంకులు ఇచ్చారని వివరించారు. వారంతా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గతంలో ఎన్నడూ ఇలా సర్వే చేసి ర్యాంకులిచ్చింది లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు […]

Advertisement
Update:2020-09-06 12:19 IST

ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు ఏపీ పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌.

పెట్టుబడిదారులు, ఆడిటర్లు, లాయర్లతో సహా పలువర్గాల వారిని సర్వే చేసి ఈ ర్యాంకులు ఇచ్చారని వివరించారు. వారంతా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గతంలో ఎన్నడూ ఇలా సర్వే చేసి ర్యాంకులిచ్చింది లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు 10 రోజుల్లోనే భూములు కేటాయించగలుగుతున్నామని వివరించారు.

పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడంలో ఏపీ ముందుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పారిశ్రామిక సంస్కరణలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కరికాల వలవన్‌ వివరించారు.

Advertisement

Similar News