ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైంది : రాష్ట్రపతి ముర్ము

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.

Advertisement
Update:2025-01-25 19:59 IST

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. న్యాయం, స్వేచ్చ, సమానత్వం. సోదరభావం ఎల్లప్పుడు మన నాగరిక వారసత్వంలో భాగాంగా ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారు. దేశంలో జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మహా కుంభమేళా మన నాగరికత వారసత్వ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్‌ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని రాష్ట్రపతి తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News