విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం

బులెటిన్‌ రిలీజ్‌ చేసిన రాజ్యసభ

Advertisement
Update:2025-01-25 17:01 IST

వైఎసార్‌ సీపీ పార్లమెంటరీ పక్షనేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి రాజీనామాకు రాజ్యసభ చైర్మన్‌ జయదీప్‌ దన్కడ్‌ ఆమోదం తెలిపారు. ఈమేరకు రాజ్యసభ శనివారం పార్లమెంటరీ బులెటిన్‌ రిలీజ్‌ చేసింది. ఈ స్థానం ఈనెల 25వ తేదీ నుంచి ఖాళీ అయినట్టుగా బులెటిన్‌లో ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి వెదొలుగుతున్నానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం రాజ్యసభ చైర్మన్‌ ను ఆయన చాంబర్‌ లో కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి దూరమైన నాలుగో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. వైసీపీలో జగన్‌ తర్వాత నంబర్‌ 2గా ఉన్న ఆయన జగన్‌ వారించినా వినకుండా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో నిర్వహించబోయే ఉప ఎన్నికల్లో ఈ సీటు ఏపీలో కూటమి సర్కారుకు దక్కనుంది. ఈ స్థానం నుంచి మెగాస్టార్‌ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్‌ చేసే అవకాశమున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News