మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు 14.95 శాతం పెంపు
మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ బస్సు ఛార్జీలలో 14.95% పెంపును ఆమోదించింది
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ఛార్జీల పెంపు త్వరలో అమల్లోకి రానుండడంతో, ప్రయాణీకులు అధిక ఖర్చులతో సతమతమవుతున్నారు.
అయితే MSRTC కార్యాచరణ సవాళ్లను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశం యొక్క పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య రాష్ట్రంలోని మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్‌లలో ఒకటి, సుమారు 15,000 బస్సులను నడుపుతోంది మరియు ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తోంది