ఎవరు బాబూ దళిత ద్రోహి? " మేరుగ నాగార్జున సూటి ప్రశ్న
రాష్ట్రంలో ఎవరిమీద ఎప్పుడు ఎవరు దాడి చేసినా.. దాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. సీఎం జగన్ అమరావతి రైతుల ద్రోహి అన్నారు, బీసీలంటే ఆయనకు గిట్టదన్నారు, దళితులపై పగ తీర్చుకుంటున్నారంటూ తాజాగా ఓ పుస్తకాన్నే అచ్చువేయించాయి. గోలెబ్స్ ప్రచారంలో ఆరితేరిన బాబు రచనా చమత్కారాల గురించి వేరే చెప్పాలా? ఆస్థాన విద్వాంసులతోటి ధ్వంస రచన చేయించి అచ్చేసి వదిలారు. అయితే ఈ విషయంలో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ దళిత నేతలు […]
రాష్ట్రంలో ఎవరిమీద ఎప్పుడు ఎవరు దాడి చేసినా.. దాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. సీఎం జగన్ అమరావతి రైతుల ద్రోహి అన్నారు, బీసీలంటే ఆయనకు గిట్టదన్నారు, దళితులపై పగ తీర్చుకుంటున్నారంటూ తాజాగా ఓ పుస్తకాన్నే అచ్చువేయించాయి.
గోలెబ్స్ ప్రచారంలో ఆరితేరిన బాబు రచనా చమత్కారాల గురించి వేరే చెప్పాలా? ఆస్థాన విద్వాంసులతోటి ధ్వంస రచన చేయించి అచ్చేసి వదిలారు.
అయితే ఈ విషయంలో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ దళిత నేతలు చంద్రబాబుని దుయ్యబడుతున్నారు. బాబు హయాంలో జరిగిన దారుణాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి తెస్తున్నారు.
రాష్ట్రంలో ఎస్సీలపై చంద్రబాబు వ్యవస్థాపరమైన దాడి చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. 40ఏళ్లుగా ఎస్సీలపై చంద్రబాబు పగ పెంచుకున్నారని, ఆయన హయాంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయని చెప్పారు. బాబు హయాంలో దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 4వస్థానంలో ఉండేదని గణాంకాలతో సహా వివరించారు.
దళితుల్లో పుట్టాలని ఎవరూ అనుకోరంటూ.. చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు నాగార్జున. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం కట్టి, స్మృతి వనం ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు తన హామీ నెరవేర్చుకోలేకపోయారని నిలదీశారు.
గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం విషయంలో జరిగిన గొడవలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే బాబు అడ్డుకోలేకపోయారని, ప్రతిపక్షంలో ఉన్న జగన్ అక్కడకు వచ్చి అండగా నిలిచారని గుర్తు చేశారు.
దళితులపై టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన అకృత్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలో దళితులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కోర్టు కేసుల ద్వారా దాన్ని అడ్డుకున్న ఘనత బాబుకే దక్కుతుందని అన్నారు నాగార్జున.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలులోకి వస్తే.. ప్రతి దళిత బిడ్డా ప్రయోజకుడు అవుతాడని, అందుకే దీన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు దళితులపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు నాగార్జున.
రాష్ట్రంలో దళితులపై జరిగిన చెదురుమదురు సంఘటనల్ని అడ్డం పెట్టుకుని వాటన్నిటినీ తమ పార్టీకి, జగన్ కి ఆపాదించాలనుకోవడం సమంజసం కాదని అన్నారు. సీఎం జగన్ దళితుల పక్షాన నిలబడ్డారు కాబట్టే.. పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారని బదులిచ్చారు. అసలు సిసలు దళిత ద్రోహి చంద్రబాబు అని, దళిత పక్షపాతి జగన్ అని చెప్పారు.
చంద్రబాబు దళితులపై సాగించిన దమనకాండపై తాము కూడా త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకురాబోతున్నామని, టీడీపీ నేతలకి దమ్ముంటే.. దళితులపై దాడులు, దళితుల అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.