సుశాంత్ మరణంపై నవల

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చాలా పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రస్తుతం ఆ కేసు సీబీఐ చేతికి చేరింది. అంతేకాదు.. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో “వన్ ఎరేంజ్డ్ మర్డర్” అనే పుస్తకాన్ని ప్రకటించాడు రచయిత చేతన్ భగత్. పేరుకు ఇతడు రచయిత అయినప్పటికీ.. ఇతడి నవలలకు, బాలీవుడ్ కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇతడు రాసిన నవల ఆధారంగానే త్రీ ఇడియట్స్ అనే […]

Advertisement
Update:2020-08-17 03:31 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చాలా పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రస్తుతం ఆ కేసు సీబీఐ చేతికి చేరింది. అంతేకాదు.. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో “వన్ ఎరేంజ్డ్ మర్డర్” అనే పుస్తకాన్ని ప్రకటించాడు రచయిత చేతన్ భగత్.

పేరుకు ఇతడు రచయిత అయినప్పటికీ.. ఇతడి నవలలకు, బాలీవుడ్ కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇతడు రాసిన నవల ఆధారంగానే త్రీ ఇడియట్స్ అనే సినిమా తెరకెక్కింది. ఇతడు రాసిన పుస్తకం ఆధారంగానే టు స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా వచ్చాయి. సో.. ఇప్పుడీ రచయిత వన్ ఎరేంజ్డ్ మర్డర్ అనే నవలను రాస్తున్నట్టు ప్రకటించగానే, అది సుశాంత్ సింగ్ పైనే అయి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, అతడ్ని ప్లాన్డ్ గా మర్డర్ చేశారంటూ వాదించే వర్గం ఒకటి బాలీవుడ్ లో ఉంది. అంతెందుకు.. సుశాంత్ తల్లిదండ్రులు కూడా దాదాపు అదే అనుమానిస్తున్నారు. సుశాంత్ భౌతిక కాయానికి ఎందుకు పోస్ట్ మార్టమ్ చేయలేదనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఇలాంటి టైమ్ లో “వన్ ఎరేంజ్డ్ మర్డర్” అనే టైటిల్ ను చేతన్ భగత్ ప్రకటించడం సంచలనంగా మారింది.

చూస్తుంటే.. ఈ నవల రిలీజైన తర్వాత మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది. అంతేకాదు.. సినిమాగా కూడా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News