నాకు కరోనా రాదనుకున్నాను

తనకు కరోనా వచ్చిందంటే అస్సలు నమ్మలేకపోతున్నానంటున్నాడు బిత్తిరి సత్తి. తను చాలా ఫిట్ గా ఉంటానని, పైగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ షూటింగ్ చేశానని.. అయినప్పటికీ తనకు కరోనా సోకిందని బాధ వ్యక్తంచేశాడు. “ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. నాది స్టాండర్డ్ బాడీ. నాకెందుకు వస్తుందిలే అనుకున్నాను. కానీ మనం ఆరోగ్యంగా ఉన్న టైమ్ లో అది బయటకు రాదు. ఏమాత్రం అలిసిపోయినా, అనారోగ్యం వచ్చినా అప్పుడది బయటకొస్తుంది. నాకు అలానే వచ్చింది. నాకు ఎలాంటి […]

Advertisement
Update:2020-08-17 12:29 IST

తనకు కరోనా వచ్చిందంటే అస్సలు నమ్మలేకపోతున్నానంటున్నాడు బిత్తిరి సత్తి. తను చాలా ఫిట్ గా ఉంటానని, పైగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ షూటింగ్ చేశానని.. అయినప్పటికీ తనకు కరోనా సోకిందని బాధ వ్యక్తంచేశాడు.

“ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. నాది స్టాండర్డ్ బాడీ. నాకెందుకు వస్తుందిలే అనుకున్నాను. కానీ మనం ఆరోగ్యంగా ఉన్న టైమ్ లో అది బయటకు రాదు. ఏమాత్రం అలిసిపోయినా, అనారోగ్యం వచ్చినా అప్పుడది బయటకొస్తుంది. నాకు అలానే వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాల్లేవ్. జలుబు, దగ్గు, జ్వరం ఏమీ లేవు. కాకపోతే నాలుక మందంగా అయినట్టు అనిపిస్తోంది.”

ఇలా తన కరోనా లక్షణాల్ని బయటపెట్టాడు సత్తి. మనకు రాదులే అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నాడు.

ప్రస్తుతం సత్తి హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతున్నాడు. దీంతో పాటు అల్లం, బెల్లం, మిరియాలు కలిపిన మిశ్రమాన్ని తింటున్నాడు. ఇలా చేయడం వల్ల తొందరగా కరోనాను జయించొచ్చని చెబుతున్నాడు.

Publiée par Bithiri Sathi – Ravi Kumar sur Dimanche 16 août 2020

Tags:    
Advertisement

Similar News