వర్మ నుంచి మరో అరాచకం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో “ఆణిముత్యం” వచ్చింది. పైకి సినిమా అని చెబుతూ వరుసగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న ఈ దర్శకుడు.. తాజాగా అదే కోవలో “థ్రిల్లర్” అనే మూవీ తీసి వదిలాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఇది స్ట్రీమింగ్ కొచ్చింది. 200 రూపాయలు టిక్కెట్ పెట్టిన వర్మ “థ్రిల్లర్”తో జనాల్ని మరోసారి పిచ్చోళ్లను చేశాడు. అటుఇటుగా అర్థగంట నిడివి కూడా లేని ఈ వీడియోలో మరోసారి తన మార్క్ 4 యాంగిల్స్, […]

Advertisement
Update:2020-08-16 11:30 IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో “ఆణిముత్యం” వచ్చింది. పైకి సినిమా అని చెబుతూ వరుసగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న ఈ దర్శకుడు.. తాజాగా అదే కోవలో “థ్రిల్లర్” అనే మూవీ తీసి వదిలాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఇది స్ట్రీమింగ్ కొచ్చింది.

200 రూపాయలు టిక్కెట్ పెట్టిన వర్మ “థ్రిల్లర్”తో జనాల్ని మరోసారి పిచ్చోళ్లను చేశాడు. అటుఇటుగా అర్థగంట నిడివి కూడా లేని ఈ వీడియోలో మరోసారి తన మార్క్ 4 యాంగిల్స్, హీరోయిన్ తో 3 సీన్స్ చూపించి మమ అనిపించాడు.

ఇక్కడ హీరోయిన్ తో సీన్స్ అంటే ఏదో ఊహించుకోవద్దు. కేవలం ఆమె అందాల్ని క్లోజ్ లో చూపించి ఆనందపడమన్నాడు వర్మ. 23 నిమిషాల ఈ వీడియోలో మాంటేజ్ షాట్స్, వర్మ యాంగిల్స్ కే దాదాపు 17-18 నిమిషాలు పోయింది. మిగతా 3-4…d సినిమాల్లో తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు.

ఈ వీడియోతో “చీప్ థ్రిల్స్ కెన్ కాజ్ డెత్” అనే సందేశాన్నిచ్చాడు ఆర్జీవీ. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి.. “చీప్ ట్రిక్స్ కెన్ మేక్ యు బఫూన్” (చీప్ ట్రిక్స్ నిన్ను బఫూన్ ను చేయగలవు) అంటూ మరోసారి తిట్ల దండకం అందుకున్నారు.

Tags:    
Advertisement

Similar News