ఆ స్క్రిప్ట్ నాది... దేవకట్టా వార్నింగ్

ఒకరు అనుకున్న కథను మరొకరు తెరకెక్కించడం టాలీవుడ్ లో కొత్త కాదు. దీన్ని గ్రంథచౌర్యం అంటారు. ఇండస్ట్రీలో మాత్రం దీనికి ముద్దుగా “స్ఫూర్తి” అనే పదం తగిలించి దర్జాగా కాపీ కొట్టేస్తుంటారు. తాజాగా ఇలాంటిదే మరో “స్ఫూర్తి” బయటపడింది. చంద్రబాబు-వైఎస్ఆర్ అనుబంధం, రాజకీయ వైరంపై రాజ్ అనే వ్యక్తి ఓ వెబ్ సిరీస్ ప్రకటించాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు జీ5 ఓటీటీకి చదరంగం అనే సిరీస్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ వైఎస్ఆర్-చంద్రబాబుపై రాజ్ ప్రకటించిన వెబ్ సిరీస్ […]

Advertisement
Update:2020-08-11 10:32 IST

ఒకరు అనుకున్న కథను మరొకరు తెరకెక్కించడం టాలీవుడ్ లో కొత్త కాదు. దీన్ని గ్రంథచౌర్యం అంటారు. ఇండస్ట్రీలో మాత్రం దీనికి ముద్దుగా “స్ఫూర్తి” అనే పదం తగిలించి దర్జాగా కాపీ కొట్టేస్తుంటారు. తాజాగా ఇలాంటిదే మరో “స్ఫూర్తి” బయటపడింది.

చంద్రబాబు-వైఎస్ఆర్ అనుబంధం, రాజకీయ వైరంపై రాజ్ అనే వ్యక్తి ఓ వెబ్ సిరీస్ ప్రకటించాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు జీ5 ఓటీటీకి చదరంగం అనే సిరీస్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ వైఎస్ఆర్-చంద్రబాబుపై రాజ్ ప్రకటించిన వెబ్ సిరీస్ కాన్సెప్ట్ తనది అంటున్నాడు దర్శకుడు దేవకట్టా.

దాదాపు మూడేళ్ల కిందటే ఈ సిరీస్ కోసం కాన్సెప్ట్ రాసుకున్నాడట దేవకట్టా. దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి కూడా మార్చాడట. ప్రస్తుతం కొన్ని ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న టైమ్ లో రాజ్ అనే వ్యక్తి ఇలా తన కాన్సెప్ట్ తో సిరీస్ ప్రకటించాడని ఆరోపిస్తున్నాడు దేవకట్టా.

గతంలో కూడా తను రాసుకున్న ఓ స్టోరీని ఇలానే కాపీకొట్టారని.. ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోనని చట్టపరంగా ముందుకెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు ఈ దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News