చేతులు కడగాల్సిందే... కానీ నీళ్లేవి?!

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రతరం కావడానికి మరో భిన్నమైన కారణం తెరపైకి వచ్చింది. వైరస్ ని నివారించడానికి సబ్బుతో ఇరవై సెకన్లపాటు శుభ్రంగా చేతులను కడగాలని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే  ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జనం శుభ్రమైన నీరు, తగినంత నీరు అందని పరిస్థితుల్లో జీవిస్తున్న నేపథ్యంలో అది సాధ్యం అయ్యే పని కాదని అంటోంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్-వాటర్. ప్రపంచంలో ప్రతి అయిదుగురిలో ఇద్దరికి రోజువారీ దినచర్యకు అవసరమైన నీరు లేదని దాంతో చేతులను […]

Advertisement
Update:2020-08-09 02:00 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రతరం కావడానికి మరో భిన్నమైన కారణం తెరపైకి వచ్చింది. వైరస్ ని నివారించడానికి సబ్బుతో ఇరవై సెకన్లపాటు శుభ్రంగా చేతులను కడగాలని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జనం శుభ్రమైన నీరు, తగినంత నీరు అందని పరిస్థితుల్లో జీవిస్తున్న నేపథ్యంలో అది సాధ్యం అయ్యే పని కాదని అంటోంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్-వాటర్.

ప్రపంచంలో ప్రతి అయిదుగురిలో ఇద్దరికి రోజువారీ దినచర్యకు అవసరమైన నీరు లేదని దాంతో చేతులను తరచుగానూ ఎక్కువ సమయంపాటు కడిగే అవకాశం చాలామందికి లేదని, ప్రపంచంలో మూడువందలకోట్ల మందికి ఇళ్లలో సరిపడా నీరు, సబ్బు లేవని, నాలుగు వందల కోట్లమంది సంవత్సరంలో నెలరోజులు విపరీతమైన నీటి కొరతని ఎదుర్కొంటున్నారని యుఎన్-వాటర్… తెలిపింది.

ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పించడంలో అందుకు సరిపడా పెట్టుబడులు పెట్టటంలో జరిగిన వైఫల్యమే ఇలాంటి దుస్థితికి కారణమని ఐక్యరాజ్యసమితి-వాటర్ ఛైర్ పర్సన్ గిల్ బెర్ట్ ఎఫ్. హాంగ్బో అన్నారు. సంవత్సరాల తరబడి మంచినీరు, పారిశుధ్యం వసతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో వైరస్ విజృంభించి అందరినీ ప్రమాదంలోకి నెట్టిందని గిల్ బెర్ట్ అన్నారు.

దీర్ఘకాలంలో కాకుండా ఇప్పటికిప్పుడు… చేతులను శుభ్రం చేసుకునే అవకాశాలను పెంచేందుకు జపాన్లోని కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. యునిసెఫ్ లాంటి సంస్థలతో కలిసి… తక్కువ నీటితోనే చేతులను కడిగే వీలున్న హ్యాండ్ వాషింగ్ పరికరాలను రూపొందిస్తున్నాయివి. అమ్మకాలకు ముందే… వీటిని పేదవారికి ఉచితంగా అందించాలనే ఆలోచనలో ఉన్నాయా కంపెనీలు.

Tags:    
Advertisement

Similar News