పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ను హ్యాక్ చేసి భారత జాతీయ జెండాను ఎగరేసిన హ్యాకర్లు
పాకిస్తాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన డాన్ న్యూస్ ఛానల్‌కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆ న్యూస్ ఛానల్‌ను హ్యాక్ చేసి భారత జాతీయ జెండాను స్క్రీన్‌పై ఎగరవేశారు. అంతే కాకుండా దాని కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా రాశారు. న్యూస్ ఛానల్‌లో యాడ్స్ వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మార్లు డాన్ న్యూస్ ఛానల్‌లో భారత జాతీయ జెండా ఎగురుతూ కనిపించడం […]
పాకిస్తాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన డాన్ న్యూస్ ఛానల్‌కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆ న్యూస్ ఛానల్‌ను హ్యాక్ చేసి భారత జాతీయ జెండాను స్క్రీన్‌పై ఎగరవేశారు. అంతే కాకుండా దాని కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా రాశారు. న్యూస్ ఛానల్‌లో యాడ్స్ వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మార్లు డాన్ న్యూస్ ఛానల్‌లో భారత జాతీయ జెండా ఎగురుతూ కనిపించడం ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పాకిస్తానీ నెటిజన్స్ ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన వీడియోలు షేర్ చేశారు. పాకిస్తాన్ టీవీలో భారత జాతీయ జెండాతో శుభాకాంక్షలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, దీనిపై డాన్ న్యూస్ ఒక ప్రకటన జారీ చేసింది. ‘హ్యాకర్లు డాన్ న్యూస్ ఛానల్‌పై సైబర్ దాడి చేశారు. దీంతో ఆదివారం పలుమార్లు ఇండియన్ ఫ్లాగ్ టీవీ స్క్రీన్లపై ఎగురుతూ కనిపించింది. దీనిపై విచారణ జరుపుతున్నాము. సైబర్ క్రైం సెల్‌కు కూడా పిర్యాదు చేశాము’ అని డాన్ న్యూస్ తమ ప్రకటనలో పేర్కొన్నది. అయితే ఈ సైబర్ దాడికి కారకులెవరో ఇప్పుడే చెప్పడం కష్టమని కూడా డాన్ న్యూస్ ఛానల్ పేర్కొంది.
ఈ నెల అగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం.. ఆ తర్వాత రోజు ఇండియా స్వాతంత్ర దినోత్సవం.
What the hell Dawn News ? Get out from Pakistan @Dawn_News
– Love Pakistan or Leave Pakistan pic.twitter.com/8Wj9tyalnw— Pakistan Youth Team (@PakYouthTeam01) August 2, 2020