కంటెంట్ లేకుండా ఓటీటీ పెట్టాడు

ప్రస్తుతం ఓటీటీ సీజన్ నడుస్తోంది. దీంతో కొంతమంది ఏటీటీ, మరికొందరు ఓటీటీ అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బ్యాచ్ లోకి రాజారవీంద్ర కూడా చేరాడు. తను కూడా ఓ ఓటీటీ వేదిక పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. కంటెంట్ కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. కానీ దానికి రెస్పాన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వచ్చింది. “కంటెంట్ చూస్తున్నాం. చాలా స్క్రిప్టులు వచ్చాయి. ఇప్పటివరకు 15వేల మంది రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కువమంది కంటెంట్ తో రాలేదు. వేషాలు ఇవ్వమని అడిగారు. ఇంకా […]

Advertisement
Update:2020-07-31 02:42 IST

ప్రస్తుతం ఓటీటీ సీజన్ నడుస్తోంది. దీంతో కొంతమంది ఏటీటీ, మరికొందరు ఓటీటీ అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బ్యాచ్ లోకి రాజారవీంద్ర కూడా చేరాడు. తను కూడా ఓ ఓటీటీ వేదిక పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. కంటెంట్ కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. కానీ దానికి రెస్పాన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వచ్చింది.

“కంటెంట్ చూస్తున్నాం. చాలా స్క్రిప్టులు వచ్చాయి. ఇప్పటివరకు 15వేల మంది రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కువమంది కంటెంట్ తో రాలేదు. వేషాలు ఇవ్వమని అడిగారు. ఇంకా ఎక్కువ మంది హాయ్ అన్నా ఎలా ఉన్నావ్ అంటూ స్పందించారు. అసలు కంటెంట్ చాలా తక్కువ. ఉపయోగపడే కంటెంట్ ఓ 10-20 మాత్రమే ఉన్నాయి. ఇంకా కొంచెం ప్రాపర్ గా చేస్తే బెటర్ గా ఉండేదేమో. ఓ వెబ్ సైట్ పెట్టి దాని ద్వారా చేస్తే బాగుండేది. డైరక్ట్ గా ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల ఇబ్బంది వచ్చింది.”

సినిమా కంటే 50 రెట్లు ఎక్కువ ఆడియన్స్ రీచ్ ఓటీటీకి ఉంటుంది కాబట్టి.. ఏదో ఒక జానర్ కు ఫిక్స్ అవ్వకుండా.. అన్ని జానర్స్ టచ్ చేస్తూ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపాడు రాజారవీంద్ర. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్, షార్ట్ స్టోరీస్.. ఇలా అన్నీ తన ఓటీటీలో ఉంటాయంటున్నాడు.

నిజానికి రాజారవీంద్రకు ఓటీటీలోకి వెళ్లాలనే ఆలోచన లేదంట. ఆయన ఫ్రెండ్స్ ఓ ముగ్గురు ఈ ప్రతిపాదన చేయడంతో ఈయన కూడా జాయిన్ అయ్యాడంట. తను ఓటీటీ పెట్టకపోతే ఎవ్వరూ ఏమీ అనరని, పెట్టిన తర్వాత క్లిక్ అవ్వకపోతే మాత్రం అంతా విమర్శిస్తారని, ఆ భయం తనకు ఉందంటున్నాడు ఈ నటుడు.

Tags:    
Advertisement

Similar News