లూసిఫర్ రీమేక్ ఇక లేనట్టేనా?

చిరంజీవి హీరోగా రాబోతున్న లూసిఫర్ సినిమాపై ఒకటి కాదు, రెండు కాదు.. రోజుకో పుకారు వినిపిస్తోంది. దర్శకుడు మారిపోతాయడని కొందరు, టోటల్ సినిమానే ఆగిపోయిందని మరికొందరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై మెగా కాంపౌండ్ కూడా ఇప్పట్లో స్పందించే ఆలోచనలో లేదు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ అన్నీ అవాస్తవాలు అని తేలాయి. లూసిఫర్ రీమేక్ ప్రాజెక్టును సుజీత్ కు అప్పగించారు. చిరంజీవి మేనరిజమ్, స్టయిల్, ఇమేజ్ కు తగ్గట్టు […]

Advertisement
Update:2020-07-31 10:30 IST

చిరంజీవి హీరోగా రాబోతున్న లూసిఫర్ సినిమాపై ఒకటి కాదు, రెండు కాదు.. రోజుకో పుకారు వినిపిస్తోంది. దర్శకుడు మారిపోతాయడని కొందరు, టోటల్ సినిమానే ఆగిపోయిందని మరికొందరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై మెగా కాంపౌండ్ కూడా ఇప్పట్లో స్పందించే ఆలోచనలో లేదు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ అన్నీ అవాస్తవాలు అని తేలాయి.

లూసిఫర్ రీమేక్ ప్రాజెక్టును సుజీత్ కు అప్పగించారు. చిరంజీవి మేనరిజమ్, స్టయిల్, ఇమేజ్ కు తగ్గట్టు ఈ ప్రాజెక్టుకు మార్పులు చేశాడు సుజీత్. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇంతవరకే. కనీసం సుజీత్ చేసిన మార్పులు కూడా చిరంజీవి వినలేదు. ఈలోగానే ఈ ప్రాజెక్టు చేతులు మారిందని, వీవీ వినాయక్ కు రీమేక్ బాధ్యతలు అప్పగించారంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదనేది తాజా సమాచారం.

ఇప్పటికిప్పుడు లూసిఫర్ రీమేక్ పై స్పందించడం చిరంజీవికి ఇష్టంలేదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు కంటే ముందు ఆచార్య సినిమా ఉంది. అదెప్పుడు సెట్స్ పైకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమా కావడం, సెట్స్ కూడా ఆల్రెడీ వేసి పెట్టడంతో చాలా డబ్బు వృధా అయింది. ముందుగా ఆచార్యను కంప్లీట్ చేయాలనేది చిరంజీవి ఆలోచన. అందుకే ఆయన లూసిఫర్ పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అటు రామ్ చరణ్ ది కూడా ఇదే ఆలోచన.

Tags:    
Advertisement

Similar News