సోనూ సూద్ ఆస్తి విలువ రూ. 130 కోట్లు

ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న పేరు సోనూ సూద్. సినిమాలో విలన్ పాత్రలు వేసినా గత కొన్ని రోజులుగా అందరితో హీరో అని పిలిపించుకుంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకొని పోయిన ఎంతో మందిని తన సొంత డబ్బుతో సొంతూర్లకు పంపించడంతో సోనూ దాతృత్వం వెలుగులోనికి వచ్చింది. ముంబైలో ఉండలేక, అటూ ఊర్లకు పోలేక నానా యాతనలు పడుతున్న ఎంతో మందిని సోనూ అదుకున్నాడు. అప్పుడు మొదలైన అతడి సేవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏపీలోని […]

Advertisement
Update:2020-07-29 04:05 IST

ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న పేరు సోనూ సూద్. సినిమాలో విలన్ పాత్రలు వేసినా గత కొన్ని రోజులుగా అందరితో హీరో అని పిలిపించుకుంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకొని పోయిన ఎంతో మందిని తన సొంత డబ్బుతో సొంతూర్లకు పంపించడంతో సోనూ దాతృత్వం వెలుగులోనికి వచ్చింది. ముంబైలో ఉండలేక, అటూ ఊర్లకు పోలేక నానా యాతనలు పడుతున్న ఎంతో మందిని సోనూ అదుకున్నాడు.

అప్పుడు మొదలైన అతడి సేవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇలా ఎంతో మందికి సహాయం చేస్తుండగా.. అసలు ఒక విలన్‌కు అంత డబ్బు ఎక్కడిదనే అనుమానాలు అందరికీ తలెత్తాయి. దీనిపై ఒక బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేసింది.

గత 20 ఏళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తున్న సోనూసూద్ బాగానే సంపాదించాడు. తాను నటుడిగా సంపాదించిన డబ్బును రెస్టారెంట్లు తెరిచి మరింతగా దాన్ని పెంచుకున్నాడు. ముంబైలో ఆయనకు రెస్టారెంట్లు, హోట్లల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతని ఆస్తి విలువ రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.

లాక్‌డౌన్ నాటి నుంచి సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆ అధ్యయన సంస్థ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News