కన్నా కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్‌

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. కన్నా కోడలు నల్లపురెడ్డి సుహారిక మృతిపై అనుమానాలు ఉన్నాయని భర్త ఫణీంద్ర అంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు అప్పట్లోనే తన అనుమానాలు వివరించారు. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని… తోడల్లుడితో అస్తుల గొడవలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి సుహారిక మేనెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. […]

Advertisement
Update:2020-07-24 13:56 IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. కన్నా కోడలు నల్లపురెడ్డి సుహారిక మృతిపై అనుమానాలు ఉన్నాయని భర్త ఫణీంద్ర అంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు అప్పట్లోనే తన అనుమానాలు వివరించారు. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని… తోడల్లుడితో అస్తుల గొడవలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

నల్లపురెడ్డి సుహారిక మేనెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు చెప్పారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తన భార్య సుహారిక మృతిలో అనేక అనుమానాలున్నాయని భర్త ఫణీంద్ర ఆరోపిస్తున్నారు. మొదట ఆమె సిబిఐటి వద్ద చనిపోయిందని చెప్పారని…తర్వాత ఏఐజి హాస్పిటల్ వద్ద ఉన్న బ్యాంబో హిల్స్ వద్ద చనిపోయిందని చెప్పారని అన్నారు. తన భార్యకు మందు తాగే అలవాటు లేదని, కానీ ఆ రోజు ఏదో డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా ప్రచారం చేశారని చెప్పారు. తన భార్య మారథాన్ రన్నర్ అని….ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నారు. తోడల్లుడుకి ఆర్థిక సమస్యలు ఉన్నాయని వివరించారు. వాటి గురించి మాట్లాడేందుకు ఆరోజు పిలిచారని…తర్వాత ఆమె మృతిచెందిందని చెప్పుకొచ్చారు.

ఆ పార్టీ జరిగిన సమయంలో మొత్తం నలుగురు ఉన్నారని…వారు ఏం చేశారు? ఆమె ఎలా చనిపోయింది? అనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. ఇప్పుడు భర్త ఫణీంద్ర ఆరోపణలతో ఈ కేసు మిస్టరీగా మారింది. మరీ సైబర్‌బాద్‌ పోలీసులు ఏం తేలుస్తారు? ఈ కేసులో అసలేం జరిగింది? హై ప్రొపైల్‌ కేసు కావడంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News