ఏపీలో ఇక ఇంటి వద్దే కరోనా పరీక్షలు

ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 102 ఐమాస్క్ బస్సుల ద్వారా కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. మరోవైపు ఏపీలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. సంజీవని పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ తేలితే వారికి ఆసుపత్రుల్లో కానీ, హోం ఐసోలేషన్‌కు కానీ పంపుతున్నారు. ఇక కరోనా లక్షణాలతో బాధపడుతున్నా, వ్యాధి సోకిన అనుమానం ఉండి మానసికంగా సతమతం అవుతున్న వారికి కౌన్సిలింగ్ […]

Advertisement
Update:2020-07-24 02:51 IST

ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 102 ఐమాస్క్ బస్సుల ద్వారా కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. మరోవైపు ఏపీలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. సంజీవని పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ తేలితే వారికి ఆసుపత్రుల్లో కానీ, హోం ఐసోలేషన్‌కు కానీ పంపుతున్నారు.

ఇక కరోనా లక్షణాలతో బాధపడుతున్నా, వ్యాధి సోకిన అనుమానం ఉండి మానసికంగా సతమతం అవుతున్న వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక బయటకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నట్లైతే వారి కోసం ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంటి వద్ద పరీక్ష చేయించుకోవాలంటే…

https://covid-andhrapradesh.verahealthcare.com/person/register

అనే వెబ్ అడ్రస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు నమోదు చేస్తే 24 గంటల్లోగా వైద్య సిబ్బంది ఇంటికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తారని అన్నారు. సేకరించిన శాంపిల్ ఫలితాలు కూడా 48 గంటల్లో మొబైల్ ఫోన్‌కు పంపిస్తారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News