బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌

నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం దుమారం రేపింది. తీవ్ర వివాదాస్పదమైంది. మాలక్ష్మమ్మ ఆలయానికి అడ్డుగా ఉండడంతో విగ్రహాన్ని తొలగించామని… దాన్ని ప్రధాన కూడలి సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం పక్కనే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోజే ప్రకటించారు. విగ్రహం తొలగింపుపై చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు. నెల్లూరు జిల్లా నేతలకు ఫోన్‌ చేసి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తాకాలంటే వైసీపీ నేతలకు వణుకు […]

Advertisement
Update:2020-07-23 14:59 IST

నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం దుమారం రేపింది. తీవ్ర వివాదాస్పదమైంది. మాలక్ష్మమ్మ ఆలయానికి అడ్డుగా ఉండడంతో విగ్రహాన్ని తొలగించామని… దాన్ని ప్రధాన కూడలి సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం పక్కనే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోజే ప్రకటించారు.

విగ్రహం తొలగింపుపై చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు. నెల్లూరు జిల్లా నేతలకు ఫోన్‌ చేసి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తాకాలంటే వైసీపీ నేతలకు వణుకు పుట్టేలా ప్రతిఘటన ఉండాలని నేతలను రెచ్చగొట్టారు. బాలకృష్ణ కూడా నెల్లూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి ఎన్టీఆర్ విగ్రహం తిరిగి ఏర్పాటు చేసే వరకు వెనక్కు తగ్గవద్దని మరింత ఆజ్యం పోశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి …గురువారం మధ్యాహ్నం బాలకృష్ణకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.

ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం … మాలక్ష్మమ్మ ఆలయానికి ఎదురుగా ఉండడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు విగ్రహాన్ని తొలగించారని బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వివరించారు. వివాదాస్పదం కాని చోట విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడడంతో బాలకృష్ణ కూడా కన్విన్స్‌ అయ్యారని టీడీపీ మీడియా చెబుతోంది. విగ్రహం వివాదం ముగిసినట్టేనని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News