ఏపీలో ఐమాస్క్ కేంద్రాలుగా 102 బస్సులు

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో టెస్టుల సంఖ్య పెంచాలని ఐక్యరాజ్యసమితి చెబుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇక దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఐమాస్క్ (ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీసెస్ క్వారంటైన్) బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఇంద్ర బస్సులకు పలు మార్పులు చేసి కోవిడ్-19 టెస్టింగ్ […]

Advertisement
Update:2020-07-18 05:03 IST

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో టెస్టుల సంఖ్య పెంచాలని ఐక్యరాజ్యసమితి చెబుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇక దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఐమాస్క్ (ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీసెస్ క్వారంటైన్) బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఇంద్ర బస్సులకు పలు మార్పులు చేసి కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు అదనంగా 52 కొత్త బస్సులను ఐమాస్క్‌ కేంద్రాలుగా మార్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఐమాస్క్ బస్సుల సంఖ్య 102కి చేరుకుంది.

మొదటి విడతలో 50 బస్సులను జూన్ 3న ఏపీ ప్రభుత్వం పలు జిల్లాలకు పంపింది. అయితే పరీక్షల సంఖ్య పెంచే ఉద్దేశంతో మరో 52 కొత్త బస్సులను తాజాగా పలు జిల్లాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 ప్రాంతాల్లో ఈ బస్సులను నిలిపి పరీక్షలు చేస్తున్నారు. ఈ బస్సుల ద్వారా డిజిటలైజ్ స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఈ బస్సుల ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఐమాస్క్ బస్సులు ఎలా పని చేస్తాయో రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు.

ఈ 102 బస్సుల ద్వారా సామూహిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఒకే సారి 10 నుంచి 12 మందికి ఈ బస్సుల్లో శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. కాంటాక్ట్ లెస్ పద్దతిలో బస్సులో శాంపిల్స్ సేకరించనున్నారు. ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను నేరుగా ఐసీఎంఆర్ ల్యాబ్స్‌కు పంపింస్తారని భాస్కర్ చెప్పారు. మరోవైపు రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ చెక్ పోస్ట్ వద్ద రాష్ట్రంలోకి వచ్చే ప్రతీ ఒక్కరి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నామని.. వారి ఆధార్ కార్డు నెంబర్ సేకరించి.. టెస్టు ఫలితాల ఆధారంగా వారిని హోమ్ క్వారంటైన్ చేయడం లేదా చికిత్సా కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.

హోం క్వారంటైన్‌లో ఉన్న ప్రతీ వ్యక్తిని ఎఎన్ఎంలు నిత్యం పర్యవేక్షిస్తుంటారని, వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఆన్‌లైన్ చేస్తారని భాస్కర్ అన్నారు. టెస్టుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. 9,700 మంది వైద్య సిబ్బందిని కొత్తగా నియమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఒక సారి వీరంతా నియమించబడితే భవిష్యత్‌లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉండబోతోంది.

Tags:    
Advertisement

Similar News