తరుణ్ భాస్కర్ కు మరో ఛాన్స్

పెళ్లిచూపులతో సూపర్ హిట్ డైరక్టర్ అనిపించుకున్న తరుణ్ భాస్కర్ కు రెండో సినిమా బ్రేకులేసింది. భారీ అంచనాల మధ్య చేసిన “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమా డిజాస్టర్ అయింది. ఈ దెబ్బతో మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేకపోయాడు తరుణ్ భాస్కర్. ఏకంగా దర్శకత్వం వదిలేస్తాడేమో అనే అనుమానం కలిగేలా ముఖానికి రంగేసుకున్నాడు. అలా లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు మరో ఆఫర్ అందుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘ఓ మై కాదవులే’ సినిమాను తరుణ్ […]

Advertisement
Update:2020-07-17 15:28 IST

పెళ్లిచూపులతో సూపర్ హిట్ డైరక్టర్ అనిపించుకున్న తరుణ్ భాస్కర్ కు రెండో సినిమా బ్రేకులేసింది. భారీ అంచనాల మధ్య చేసిన “ఈ నగరానికి ఏమైంది” అనే సినిమా డిజాస్టర్ అయింది. ఈ దెబ్బతో మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేకపోయాడు తరుణ్ భాస్కర్. ఏకంగా దర్శకత్వం వదిలేస్తాడేమో అనే అనుమానం కలిగేలా ముఖానికి రంగేసుకున్నాడు.

అలా లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు మరో ఆఫర్ అందుకున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘ఓ మై కాదవులే’ సినిమాను తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో PVP సినిమాస్ సంస్థ తెలుగులో నిర్మించనుందని టాక్. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తాడని… ఈ మేరకు మీటింగ్స్ పూర్తయ్యాయని అంటున్నారు.

నిజానికి వెంకటేష్ తో సినిమా కోసం గట్టిగా ప్రయత్నించాడు తరుణ్ భాస్కర్. కానీ వెంకీతో సినిమా అంటే చాలా అడ్డంకులు దాటి వెళ్లాలి. దగ్గుబాటి కాంపౌండ్ లో ఓ పట్టాన స్క్రిప్టులకు గ్రీన్ సిగ్నల్ పడదు. అలా ఆ ప్రాజెక్టు పక్కకెళ్లిపోవడంతో ఇప్పుడీ రీమేక్ ను హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యాడు తరుణ్.

Tags:    
Advertisement

Similar News