కరోనా నియంత్రణకు వైఎస్ జగన్ కఠిన చర్యలు

ఇకపై శాశ్వతంగా కరోనా పరీక్ష కేంద్రాలు కోవిడ్-19తో చనిపోతే అంత్యక్రియలకు రూ.15వేలు సాయం దేశంలోనే అత్యధిక కరోనా నిర్థారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోనుంది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు వస్తే ఏ ఆసుపత్రిలో అయినా వైద్యం అందించాల్సిందేనని.. ఎవరైనా కరోనా రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తే ఆయా […]

Advertisement
Update:2020-07-15 05:22 IST
  • ఇకపై శాశ్వతంగా కరోనా పరీక్ష కేంద్రాలు
  • కోవిడ్-19తో చనిపోతే అంత్యక్రియలకు రూ.15వేలు సాయం

దేశంలోనే అత్యధిక కరోనా నిర్థారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోనుంది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు వస్తే ఏ ఆసుపత్రిలో అయినా వైద్యం అందించాల్సిందేనని.. ఎవరైనా కరోనా రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తే ఆయా ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.

కరోనా వైరస్‌తో దీర్ఘకాలం పోరాడాల్సి ఉంటుంది కాబట్టి అనుమానితులకు వైరస్ పరీక్షలు నిర్వహించడానికి శాశ్వత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ శాశ్వత పరీక్ష కేంద్రాలు ఎక్కడుండాలో అధికారులు ఒక సర్వే నిర్వహించి ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, కొంత మంది పేదలు కనీసం అంత్యక్రియలు కూడా జరిపించుకోలేక పోతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు సీఎం జగన్ అన్నారు. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా కరోనా కారణంగా మృతి చెందితే.. వారి అంత్యక్రియలకు రూ.15 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 17 వేల మంది వైద్యులు, 12 వేల మందికి పైగా నర్సుల నియామకానికి ప్రణాళిక రూపొందించామని జగన్ చెప్పారు. దీని ద్వారా వైద్యారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని.. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ఈ నియామకాలు దోహదపడతాయిని జగన్ చెప్పారు. ఇక అధికారులు అందరూ ప్రజల్లో కోవిడ్-19కి సంబంధించిన అవగాహన కల్పించాలని, దీని కోసం హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

క్వారంటైన్ కేంద్రాల్లో ఇస్తున్న భోజనం, అక్కడి పారిశుథ్యంపై అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. పాజిటివ్‌గా నిర్థారణ అయిన వాళ్లను ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చడం వల్లే మరణాలు సంభవిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. ఇందుకు కారణమేంటో తక్షణమే తెలుసుకొని ఆలస్యం లేకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News