ఏపీ విధానాలపై ఇతర రాష్ట్రాలు ఆరా
ఏపీ విధానాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధిక ధరకు కాకుండా తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేసేలా అధికారులకు స్వేచ్చ ఇచ్చారు. దాంతో ఏడాది కాలంగా అధికారులు సమన్వయంతో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుందో అక్కడే కొంటూ వచ్చారు. దీని వల్ల ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ కొనుగోలులోనే 700 కోట్లను ఏపీ ప్రభుత్వం ఆదా చేసింది. తాజాగా జరిగిన ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశంలో ఈ […]
ఏపీ విధానాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధిక ధరకు కాకుండా తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేసేలా అధికారులకు స్వేచ్చ ఇచ్చారు. దాంతో ఏడాది కాలంగా అధికారులు సమన్వయంతో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుందో అక్కడే కొంటూ వచ్చారు. దీని వల్ల ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ కొనుగోలులోనే 700 కోట్లను ఏపీ ప్రభుత్వం ఆదా చేసింది.
తాజాగా జరిగిన ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశంలో ఈ ఏడాది కూడా మరిన్ని పొదుపు చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పొదుపు చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని బోర్డు మీటింగ్‌లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయని శ్రీకాంత్ వివరించారు. మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు.
ముందస్తు ప్రణాళిక రూపొందించడంతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చిన మద్దతు వల్ల యూనిట్ విద్యుత్ 1.63 నుంచి రూ. 2.80 మధ్యనే కొనుగోలు చేయగలిగామని బోర్డు మీటింగ్ అభిప్రాయపడింది.. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు సంబంధించి ఈ ఏడాది 11వేల 311 కోట్లు విడుదల చేయడంతో పాటు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మొత్తం 8వేల 353 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించడంపై ట్రాన్స్‌కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది.