బెజవాడలో లాక్‌డౌన్‌ ఉపసంహరణ !

అధికారుల తొందరపాటు చర్య ఒక్కోసారి ఇలాగే ఉంటుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కూడా ఇలాగే వ్యవహరించారు. కరోనా కేసులు పెరగడంతో ఏపీలో పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఆదివారం నుంచి అమలు చేస్తున్నారు. బెజవాడలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి నుంచి కంట్రోల్‌లోకి రావడం లేదు. దీంతో ఈనెల 25 నుంచి బెజవాడలో లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల […]

Advertisement
Update:2020-06-24 01:29 IST

అధికారుల తొందరపాటు చర్య ఒక్కోసారి ఇలాగే ఉంటుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కూడా ఇలాగే వ్యవహరించారు.

కరోనా కేసులు పెరగడంతో ఏపీలో పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఆదివారం నుంచి అమలు చేస్తున్నారు. బెజవాడలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి నుంచి కంట్రోల్‌లోకి రావడం లేదు. దీంతో ఈనెల 25 నుంచి బెజవాడలో లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. వైద్యసేవలు, బ్యాంకులు యథావిధిగా నడుస్తాయని వివరించారు. అవసరమైన వస్తువులు రెండు రోజుల్లో కొనుక్కోవాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇలా ప్రకటన జారీ చేశారో లేదో రెండు గంటల్లో కలెక్టర్‌ నిర్ణయం మార్చుకున్నారు. లాక్‌డౌన్‌ ఉపసంహరించుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ లాక్‌డౌన్‌ ఉండదని ప్రకటించారు.

కరోనా కేసుల కట్టడికి కలెక్టర్లకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే కరోనా కట్టడికి శ్రీకాకుళం జిల్లా పలాస, ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కేసుల కట్టడికి తగు చర్యలు చేపట్టారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈనెల 25 నుంచి లాక్‌ డౌన్‌ విధించారు.

అయితే కృష్ణా జిల్లా కలెక్టర్‌ మాత్రం ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆ తర్వాత ఉపసంహరించుకున్నారని సమాచారం. అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ ను‌ ఇలా దుర్వినియోగం చేస్తే ఎలా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News