తెలంగాణలో ప్రతి 2 నిమిషాలకు ఒక పాజిటివ్‌ కేసు...

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యంత‌ వేగంతో పెరుగుతున్నాయి. ఆదివారం నాడు 730 కేసులు తెలంగాణలో బయటపడ్డాయి. రాజధాని నగరంలో ఒక్కరోజే 659 కేసులు రావడంతో కలకలం రేగుతోంది. ఏపీలోనే కాదు… తెలంగాణలో కూడా అన్‌లాక్‌ ఎఫెక్ట్  కనపడుతోంది. అన్‌లాక్‌ తర్వాత తెలంగాణలో గడచిన 21 రోజుల్లో 5,104 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మార్చి 22 నుంచి మే 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఈ కాలంలో కేవలం 2,676 కేసులు మాత్రమే బయటపడ్దాయి. కానీ అన్‌లాక్‌ […]

Advertisement
Update:2020-06-22 04:46 IST

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యంత‌ వేగంతో పెరుగుతున్నాయి. ఆదివారం నాడు 730 కేసులు తెలంగాణలో బయటపడ్డాయి. రాజధాని నగరంలో ఒక్కరోజే 659 కేసులు రావడంతో కలకలం రేగుతోంది.

ఏపీలోనే కాదు… తెలంగాణలో కూడా అన్‌లాక్‌ ఎఫెక్ట్ కనపడుతోంది. అన్‌లాక్‌ తర్వాత తెలంగాణలో గడచిన 21 రోజుల్లో 5,104 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మార్చి 22 నుంచి మే 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఈ కాలంలో కేవలం 2,676 కేసులు మాత్రమే బయటపడ్దాయి. కానీ అన్‌లాక్‌ తర్వాత పరిస్థితి‌ ఒక్కసారిగా మారింది. గత మూడు రోజులుగా సగటున రోజుకు ఐదువందల కేసులు నమోదు అవుతున్నాయి.

హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో టెస్ట్‌లు కూడా పెంచారు. టెస్ట్‌లు పెంచడం వల్లే కేసులు పెరుగుతున్నాయనేది అధికారుల వాదన.

అయితే చెన్నై తరహాలో ఇక్కడ 14 నుంచి 21 రోజుల లాక్‌డౌన్‌ అవసరమనేది నిపుణుల మాట. ఇప్పటికే ఏపీలో మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. 50 నుంచి 100 కేసులు నమోదు కావడంతో అక్కడి అధికారులు రంగంలోకి దిగారు.

తెలంగాణ లో కూడా అధికారులు ఆలోచించి… కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News