ప్రమాదంలో ప్రపంచం... ఒకే రోజు 1.50 లక్షల కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెడుతోంది. రోజు రోజుకూ అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను ప్రమాదంలోకి నెడుతోంది. గడచిన 24 గంటల్లో 1 లక్షా 50 వేల కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోనికి జారుకుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ […]

Advertisement
Update:2020-06-20 11:26 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెడుతోంది. రోజు రోజుకూ అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను ప్రమాదంలోకి నెడుతోంది. గడచిన 24 గంటల్లో 1 లక్షా 50 వేల కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోనికి జారుకుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రెస్ అథనోన్ తెలిపారు. కాగా, వీటిలో సగానికి పైగా కేసులు ఉత్తర, దక్షిణ అమెరికా, దక్షిణాసియా దేశాల్లోనే నిర్థారణ అయినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు మరింత కఠినతరం చేసి అమలు చేస్తే కానీ ఈ మహమ్మారిని అడ్డుకోలేమని టెడ్రెస్ స్పష్టం చేశారు.

గత కొన్ని నెలలుగా లాక్‌డౌన్ వల్ల చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయని.. మరింత సంక్షోభంలో పడకుండా ఆర్థిక వ్యవస్థలను తెరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దీంతో వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోందని.. కాబట్టి ప్రజలు తప్పకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. మరోవైపు కేసులు నమోదవుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉందని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News