బార్బర్ గా మారిన హీరో

సాధారణ రోజుల్లో స్టార్ హీరోలకు అసిస్టెంట్ ఉండేవారు. మేకప్, హెయిర్, ఫోన్ కాల్స్, ఫుడ్.. ఇలా ప్రతి పనికి ఓ అసిస్టెంట్ ఉంటాడు. చివరికి గొడుగు పట్టడానికి కూడా ఓ అసిస్టెంట్ కావాలి. కానీ లాక్ డౌన్ తో ఈ సౌకర్యాలన్నీ పోయాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. చివరికి హెయిర్ కటింగ్ కూడా తామే చేసుకోవాల్సి రావడం. ఈ దిశగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు వీడియోలు పెట్టారు. తమ కుటుంబ సభ్యులకు హెయిర్ కట్ చేసిన […]

Advertisement
Update:2020-06-17 01:30 IST

సాధారణ రోజుల్లో స్టార్ హీరోలకు అసిస్టెంట్ ఉండేవారు. మేకప్, హెయిర్, ఫోన్ కాల్స్, ఫుడ్.. ఇలా ప్రతి పనికి ఓ అసిస్టెంట్ ఉంటాడు. చివరికి గొడుగు పట్టడానికి కూడా ఓ అసిస్టెంట్ కావాలి. కానీ లాక్ డౌన్ తో ఈ సౌకర్యాలన్నీ పోయాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. చివరికి హెయిర్ కటింగ్ కూడా తామే చేసుకోవాల్సి రావడం.

ఈ దిశగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు వీడియోలు పెట్టారు. తమ కుటుంబ సభ్యులకు హెయిర్ కట్ చేసిన వీడియోల్ని రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆది పినిశెట్టి కూడా చేరిపోయాడు. అవును.. ఈ హీరో తన తండ్రి రవిరాజా పినిశెట్టికి కటింగ్, షేవింగ్ చేశాడు.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. కటింగ్, షేవింగ్ పూర్తయిన తర్వాత అచ్చమైన బార్బర్ లా తండ్రిని డబ్బులు అడిగి తీసుకున్నాడు ఆది. తండ్రి పర్స్ తీసి డబ్బు ఇవ్వబోతుంటే.. తనే ఆ పర్స్ లాక్కొని నచ్చినంత తీసుకున్నాడు. తర్వాత ప్రేమతో తండ్రిని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News