ఆ హీరోయిన్ కు ముందు చూపు ఎక్కువ

తెలుగులో గ్రాండ్ గా రీఎంట్రీ ఇద్దాం అనుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. విజయ్ దేవరకొండ సరసన “హీరో” అనే సినిమా ఓకే చేసింది. కానీ ఆ మూవీ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో మాళవిక ఇప్పుడు ముందుజాగ్రత్తలో పడింది. తెలుగు నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఓ సినిమా ఆఫర్ కూడా వదిలేసింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో […]

Advertisement
Update:2020-06-16 02:00 IST

తెలుగులో గ్రాండ్ గా రీఎంట్రీ ఇద్దాం అనుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. విజయ్ దేవరకొండ సరసన “హీరో” అనే సినిమా ఓకే చేసింది. కానీ ఆ మూవీ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో మాళవిక ఇప్పుడు ముందుజాగ్రత్తలో పడింది. తెలుగు నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఓ సినిమా ఆఫర్ కూడా వదిలేసింది ఈ ముద్దుగుమ్మ.

త్వరలోనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవికను తీసుకోవాలని అనుకున్నారు. ఆమెను సంప్రదించారు కూడా. కానీ మాళవిక మాత్రం ప్రస్తుతానికి టాలీవుడ్ ఆఫర్లు ఒప్పుకోనని తెగేసి చెప్పేసిందట. ఆమె ఇలా రియాక్ట్ అవ్వడం వెనక ఓ బలమైన కారణం ఉంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ హీరోగా మాస్టర్ అనే సినిమా చేస్తోంది మాళవిక మోహనన్. ఈ సినిమా ఎలాగూ తమిళనాట హిట్టవుతుంది. అదృష్టం బాగుండి తెలుగులో కూడా హిట్టయితే అప్పుడు టాలీవుడ్ లో బడా సినిమాలు మాత్రమే అంగీకరించాలనే ఆలోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ. అందుకే టాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. విజయ్ సినిమా రిలీజయ్యేంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది.

Tags:    
Advertisement

Similar News