బాహుబలికి ముందు.. లాక్ డౌన్ తర్వాత

ఇప్పటివరకు సినిమా రికార్డుల్ని, దాని సక్సెస్ రేంజ్ ను బాహుబలి-2తో పోల్చేవారు. ఏదైనా సినిమా హిట్టయితే అది బాహుబలిని కొట్టిందని, లేకపోతే నాన్-బాహుబలి రికార్డ్ అని వేసుకునే వారు. ఇకపై ఈ కాంపారిజన్స్ ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత అనే విధంగా వసూళ్లు వేసుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును.. బడా సినిమాలకు ఆ రేంజ్ లో వసూళ్లు రావడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. కరోనా వల్ల ప్రేక్షకులు […]

Advertisement
Update:2020-06-15 15:48 IST

ఇప్పటివరకు సినిమా రికార్డుల్ని, దాని సక్సెస్ రేంజ్ ను బాహుబలి-2తో పోల్చేవారు. ఏదైనా సినిమా హిట్టయితే అది బాహుబలిని కొట్టిందని, లేకపోతే నాన్-బాహుబలి రికార్డ్ అని వేసుకునే వారు. ఇకపై ఈ కాంపారిజన్స్ ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత అనే విధంగా వసూళ్లు వేసుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అవును.. బడా సినిమాలకు ఆ రేంజ్ లో వసూళ్లు రావడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేస్తారనేది ఓ పాయింట్ అయితే.. భౌతిక దూరం కారణంగా అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గించాల్సి రావడం మరో కారణం. దీంతో ఆటోమేటిగ్గా వసూళ్లు తగ్గిపోతాయి.

ఎప్పుడైతే వసూళ్లు తగ్గుతాయో అప్పుడిక బాహుబలి-2, అల వైకుంఠపురములో లాంటి సినిమాలతో కంపారిజన్స్ ఉండవు. అందుకే మధ్యేమార్గంగా స్టార్ హీరోలు బిఫోర్ లాక్ డౌన్, ఆఫ్టర్ లాక్ డౌన్ అంటూ రికార్డుల్ని, వసూళ్లను ప్రకటించుకునే అవకాశం ఉంది.

బాహుబలి-2ను ఇన్నాళ్లూ ఏ సినిమా కొట్టలేకపోయింది. అల వైకుంఠపురములో సినిమా ఎడ్జ్ వరకు వచ్చినా బాహుబలి-2దే పైచేయిగా నిలిచింది. అలా ఈ సినిమాను ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. కరోనా దెబ్బతో బాహుబలి-2 కొట్టుకుపోయినట్టే. ఇక దీంతో సినిమాల్ని కంపేర్ చేసే అవకాశం ఉండదని అంటోంది ట్రేడ్.

థియేటర్లు తెరిచిన తర్వాత రాబోయే పెద్ద సినిమా వకీల్ సాబ్. పవన్ నటిస్తున్న ఈ సినిమాకు ఎలా లెక్కలు చెబుతారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News