సుశాంత్ కు చెందిన ఆసక్తికర అంశాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అతడు మరణించిన నేపథ్యంలో అతడికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆ అంశాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని చూద్దాం… సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు చంద్రుడిపై ప్లాట్ ఉంది. అవును.. చంద్రుడిపై స్థలం కొనుగోలు చేశాడు ఈ హీరో. తన ప్లాట్ చూసుకోవడం కోసం ఓ ఖరీదైన టెలీస్కోప్ కూడా […]

Advertisement
Update:2020-06-15 15:57 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అతడు మరణించిన నేపథ్యంలో అతడికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆ అంశాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని చూద్దాం…

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు చంద్రుడిపై ప్లాట్ ఉంది. అవును.. చంద్రుడిపై స్థలం కొనుగోలు చేశాడు ఈ హీరో. తన ప్లాట్ చూసుకోవడం కోసం ఓ ఖరీదైన టెలీస్కోప్ కూడా కొన్నాడు. చంద్రుడిపై సీ ఆఫ్ మాస్కోవీ అనే ప్రాంతంలో సుశాంత్ కు స్థలం ఉంది. టెలీస్కోప్ సాయంతో ఆ స్థలాన్ని చూస్తుంటాడు అప్పుడప్పుడు.

సుశాంత్ సింగిల్ కాదు. ఇతడికి అంకితా లోఖండే అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియల్స్ చేసేవాడు సుశాంత్. ఆ సమయంలోనే అంకిత పరిచయమైంది. ఇద్దరూ దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2016లో విడిపోయారు. అయితే బ్రేకప్ అయినా ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

ఇక సుశాంత్ వద్ద ఖరీదైన వాహనాలున్నాయి. అప్పటివరకు అతడి దగ్గర అంత కాస్ట్ లీ వెహికల్స్ ఉన్నట్టు అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలియదంట. ముంబయి బాంద్రాలోని అతడి నివాసంలో సెల్లార్ ను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. బాలీవుడ్ ప్రముఖుల ఫేవరెట్ కంపెనీ ల్యాండ్ రోవర్ కు చెందిన కారు, సుశాంత్ వద్ద కూడా ఉంది. దీంతో పాటు మరో 2 కార్లు ఉన్నాయి. అయితే వీటితో పాటు బీఎండబ్ల్యూకు చెందిన ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి. ఒక్కో బైక్ ఖరీదు 25 లక్షల పైమాటే.

కేవలం సినిమాల్లో నటించడమే కాదు, అలా వచ్చే డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాడు సుశాంత్. తనకు వచ్చిన పారితోషికం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పై పెట్టాడు. అలా ఇప్పటివరకు 60 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు ఈ హీరో. ఇలా సుశాంత్ కు చెందిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News