లాక్ డౌన్ లో డైరక్టర్ నిశ్చితార్థం

దర్శకుడు సుజీత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మేరకు నిశ్చితార్థ వేడుక పూర్తయింది. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డెంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రవళికను సుజీత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల ఎంగేజ్ మెంట్ కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సింపుల్ గా జరిగింది. సుజీత్-ప్రవళిక పెళ్లిని ఆగస్ట్ లో చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటించబోతున్నారు. నిశ్చితార్థాన్ని సింపుల్ గా జరిపించిన కుటుంబ సభ్యులు.. […]

Advertisement
Update:2020-06-12 02:34 IST

దర్శకుడు సుజీత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మేరకు నిశ్చితార్థ వేడుక పూర్తయింది. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో డెంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రవళికను సుజీత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల ఎంగేజ్ మెంట్ కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సింపుల్ గా జరిగింది.

సుజీత్-ప్రవళిక పెళ్లిని ఆగస్ట్ లో చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటించబోతున్నారు. నిశ్చితార్థాన్ని సింపుల్ గా జరిపించిన కుటుంబ సభ్యులు.. పెళ్లిని మాత్రం గ్రాండ్ గా జరిపించాలని నిర్ణయించారు. హీరో రానా, దర్శకుడు సుజీత్ పెళ్లిళ్లు మినిమం గ్యాప్స్ లో జరిగే అవకాశం ఉంది.

రన్ రాజా రన్ సినిమాతో పాపులర్ అయ్యాడు సుజీత్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సాహో అనే సినిమా చేశాడు. కానీ అది కాస్తా ఫ్లాప్ అవ్వడంతో డల్ అయ్యాయి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఏకంగా చిరంజీవిని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు సుజీత్. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అందుకే ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రేమవివాహం కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధమే.

Tags:    
Advertisement

Similar News