ప్రభుత్వ న్యాయవాదులుగా జనసేన సభ్యులు ?

హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు న్యాయవాదులను నియమించింది. ఇటీవల ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చేయగా వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. జే. సుమతి, వడ్డిబోయన సుజనా, తిరుమలశెట్టి కిరణ్‌లను న్యాయవాదులుగా నియమించారు. వీరికి నెలకు లక్ష రూపాయల జీతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొత్త న్యాయవాదుల నియామకంపై వైసీపీ లీగల్ సెల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ అంశంపై ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా […]

Advertisement
Update:2020-06-12 01:51 IST

హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు న్యాయవాదులను నియమించింది. ఇటీవల ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చేయగా వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. జే. సుమతి, వడ్డిబోయన సుజనా, తిరుమలశెట్టి కిరణ్‌లను న్యాయవాదులుగా నియమించారు. వీరికి నెలకు లక్ష రూపాయల జీతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొత్త న్యాయవాదుల నియామకంపై వైసీపీ లీగల్ సెల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ అంశంపై ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా నియమితులైన వారి జాబితా చూసి వైసీపీ లీగల్ సెల్‌ షాక్ అయింది.

ఇద్దరు వ్యక్తులు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సన్నిహితులని చెబుతున్నారు. జనసేన లీగల్‌ సెల్‌ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తిరుమలశెట్టి కిరణ్‌ పేరు చూసి వైసీపీ లీగల్‌ సెల్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని పత్రిక వెల్లడించింది. ఈ నియామకాల విషయంలో వైసీపీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని వైసీపీ లీగల్ టీం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News