ముందుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్

షూటింగ్స్ కు అనుమతి వచ్చేసింది. ఈ నెలలోనే షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు పూర్తి సముఖంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ మరి ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఇక్కడే చాలా నిర్మాణ సంస్థలు వెయిటింగ్ మోడ్ లో పడ్డాయి. ఎవరైనా షూట్ స్టార్ట్ చేస్తే, పరిస్థితులు వాటి ప్రభావం చూసి అప్పుడు తమ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ మార్గదర్శిగా నిలవబోతోంది […]

Advertisement
Update:2020-06-02 02:00 IST
RRR Motion Poster
  • whatsapp icon

షూటింగ్స్ కు అనుమతి వచ్చేసింది. ఈ నెలలోనే షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు పూర్తి సముఖంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ మరి ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఇక్కడే చాలా నిర్మాణ సంస్థలు వెయిటింగ్ మోడ్ లో పడ్డాయి. ఎవరైనా షూట్ స్టార్ట్ చేస్తే, పరిస్థితులు వాటి ప్రభావం చూసి అప్పుడు తమ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ మార్గదర్శిగా నిలవబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా.

అవును.. టాలీవుడ్ నుంచి ముందుగా సెట్స్ పైకి వెళ్లేది ఈ సినిమానే. ఈ మేరకు రాజమౌళి ప్లానింగ్ మొత్తం సిద్ధం చేశాడు. ఎన్ని గంటలకు షూటింగ్ స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు ముగించాలి, ఎంతమంది పాల్గొనాలి, ఎవరు ఏ పనులు చేయాలి లాంటివన్నీ రెడీ చేసి పెట్టాడు. ఎవరి పనులు వాళ్లకు అప్పగించాడు. దాదాపు సగం మంది సిబ్బందితోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది యూనిట్.

అయితే ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్ అయినా హీరోలు మాత్రం అప్పుడే సెట్స్ పైకి రావట్లేదు. ముందుగా ఓ 3 రోజుల పాటు ప్యాచ్ వర్క్ సన్నివేశాలు తీయబోతున్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత పరిస్థితిని మరోసారి పునఃసమీక్షించుకొని అప్పుడు ఎన్టీఆర్-చరణ్ ను సెట్స్ పైకి పిలవాలనేది ప్లాన్.

Tags:    
Advertisement

Similar News